Wednesday, 22 November 2017

ఈ సంవత్సరంలోనే 10000 డాలర్లకు బిట్ కాయిన్

 బిట్‌కాయిన్‌ త్వరలోనే 10,000 డాలర్లకు చేరుతుందని ప్రముఖ హెడ్జ్ ఫండ్ మేనేజర్ మైక్ నోవోగ్రాజ్ అంచనావేస్తున్నారు

న్యూయార్క్: క్రిప్టోకరెన్సీ విభాగంలో మార్కెట్‌ లీడర్‌ అయిన బిట్‌కాయిన్‌ త్వరలోనే 10,000 డాలర్లకు చేరుతుందని ప్రముఖ హెడ్జ్ ఫండ్ మేనేజర్ మైక్ నోవోగ్రాజ్ అంచనావేస్తున్నారు. ఈఏడాదిలో ఇప్పటివరకు 800 శాతానికి మించి పెరిగిన బిట్‌కాయిన్‌ తాజాగా 8,400 స్థాయికి చేరుకుని ఆల్‌టైం రికార్డుహైని తిరగరాసింది. అత్యంతవేగంగా పెరుగుతున్న ఈ కరెన్సీ భవిష్యత్తు ఏమిటని బ్లూమ్‌బర్గ్‌ వేసిన ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చిన ఆయన, త్వరలోనే 10,000 డాలర్ల లక్ష్యం దిశగా ఈ క్రిప్టోకరెన్సీ దిగ్గజం అడుగులువేస్తుందని అన్నారు. బిట్‌కాయిన్‌ను బంగారంతో పోల్చారు. "బంగారానికి విలువ ఉందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టే ఆ కమోడిటీకి అంత విలువ ఉన్నట్లు, ఇదే విధంగా బిట్‌కాయిన్‌కు కూడా విలువ పెరుగుతోంది. ఇది ఒక అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంపై రూపుదిద్దుకుంది. సప్లై అతితక్కువగా ఉండడం వల్ల ఈ డిజిటల్‌ కరెన్సీకి విలువతగ్గే ప్రసక్తి లేదు." అని మైక్ నోవోగ్రాజ్ అన్నారు. ప్రస్తుతస్థాయి వద్ద ప్రాఫిట్‌బుక్‌ చేసుకోవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఈయన, క్రిప్టోకరెన్సీ క్యాటగిరీలో రెండో స్థానంలో ఉన్న ఈథర్‌పై కూడా పాజిటీవ్‌గా స్పందించారు. ప్రస్తుతం 370 డాలర్ల దగ్గర ఉన్న ఈథర్ ఈఏడాది చివరినాటికి 500 డాలర్ల మార్కుకు చేరుకుంటుందని తన విశ్లేషణను తెలియజేశారు. 
మరోవైపు బిట్‌కాయిన్‌ వద్దంటు దిగ్గజ ఇన్వెస్టర్లు సూచిస్తున్నారు. ఎవరైన బిట్‌కాయిన్‌ కొంటున్నారు అంటే వారు కచ్చితంగా మూర్ఖులని అర్థం అని, వీరు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటారని జేపీ మోర్గాన్ చేజ్ అండ్‌ కంపెనీ చీఫ్ జమీ డిమోన్ విమర్శించారు. ప్రపంచంలోని నేరస్థులకు ఇది ఒక అడ్డా అని ఆల్లియన్జ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్‌కు చెందిన నీల్ డ్వానే అన్నారు. ఇది మనీలాండరింగ్‌కు అవకాశం ఇస్తుందని బ్లాక్‌రాక్‌ ఇన్‌కార్పొరేషన్‌కు చెందిన లారీ ఫింక్ విమర్శించారు. అయితే, వీరి విమర్శలను తిప్పికొట్టిన మైక్ నోవోగ్రాజ్.. వీరందరి వయస్సు 60 ఏ‍ళ్లు దాటడం వల్లనే ఇలా ఆలోచిస్తున్నారని, తానింకా 52 ఏళ్ల వయస్సులోనే ఉండడం వల్ల పాజిటీవ్‌గా ఉన్నానని అన్నారు. 






No comments:

Post a Comment